చింత వద్దు.. చిరునవ్వే ముద్దు

Brother And Sister Play With Kid - Sakshi

సంగారెడ్డి: చిన్న పిల్లలకు బాల్యంలో ఏ చింతా ఉండదు. వారి మొహాల్లో చిరునవ్వే ఉంటుంది. ఆడించే వారు ఉంటే అంతా మరిచిపోయి సంతోషంగా ఉంటారు. ఆడేపాడే వయస్సులో ఏ కష్టమొచ్చినా పట్టించుకోరు. సంతోషంగా ఆట, పాటలతో గడుపుతారు. అలాంటిదే ఈ చిత్రం. ఓ అక్కా, తమ్ముడు చిన్నారిని ఆడిస్తూ నవ్వుల లోకంలో విహరింపచేస్తున్నారు. సంగారెడ్డి మండలం ఎంఎన్‌ఆర్‌ హాస్పిటల్‌ పరిసరాల్లో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఓ కుటుంబం వంట చేసుకుంటుండగా, ఆ అక్కా, తమ్ముడు ఏడుస్తున్న చిన్నారిని ఇటుకలు మోసే ఇనుప ట్రాలీపై ఇలా నవ్విస్తూ ఆడించారు.- సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ , సంగారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top