పార్టీ పెద్దలను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు

BJP MPs met with party elders in Delhi on Sunday - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆదివారం ఢిల్లీలో పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావులు బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్, ప్రకాశ్‌ జవదేకర్, రాం మాధవ్, మురళీధర్‌రావు, షహనవాజ్‌ హుస్సేన్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నూనె బాల్‌రాజు ఎంపీల వెంట ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top