పార్టీ ఆఫీసులోనే చదువు

BJP Kishan Reddy Non Controversial Leader  - Sakshi

నుదిటిపై బొట్టు. ఎప్పుడు చూసినా కనిపించే గడ్డం. తెలుపు లేదా కాషాయ వర్ణం కుర్తా... తో కనిపించే కుర్రాడే గంగాపురం కిషన్ రెడ్డి. ఎంతో సింపుల్ గా కనిపించే ఆయనను పార్టీలో అంతా కిషన్ అని పిలుస్తుంటారు. ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించడం ఆయన నైజం. విలక్షణ శైలి. నిజాయితీగా బతకాలన్నదే ఆయన  లక్ష్యం. జయప్రకాశ్ నారాయణ, స్వామి వివేకానంద ఆయనకు స్పూర్తి. పార్టీతో సుదీర్ఘ అనుభవం... అనుబంధం ఉన్న కిషన్ పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొన్నవారే. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ముందు అమెరికా ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల పాటు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, అంతకుముందు 1994 లో ఆయన అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ (ఏసీవైపీఎల్) కార్యక్రమంలో భాగంగా మోదీ అమెరికా పర్యటించారు. ఆ బృందంలో మోదీతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా అధికార పక్షంపై ధ్వజమెత్తేవారు. నియోజకవర్గం కేడర్ కు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తూనే చదువుకొనసాగించారు. యువమోర్చాలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై సదస్సు నిర్వహించడం, 60 దేశాల నుంచి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీలతో పాటు జాతీయస్థాయిలోని ఎంతో మంత్రి అగ్రనేతలతో పరిచయమున్న నేత. రెండుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు.

పేరు : గంగాపురం కిషన్‌రెడ్డి
పుట్టిన తేది : 15 మే 1964
ఊరు : తిమ్మాపూరి గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా
తల్లితండ్రులు : అండాలమ్మ, స్వామిరెడ్డి
చదువు : సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ బాలానగర్‌లో  టూల్‌ ఇంజనీరింగ్‌ డిప్లమో చదివారు.
కుటుంబం : భార్య కావ్య, కుమారుడు తన్మయి, కుమార్తె వైష్ణవి 
ఆహార్యం : కుర్తా, పైజామా (తెలుపు రంగు అయితే ఇష్టం )
హాబీలు : టీవీ చూడడం, వార్తా పత్రికలు చదవడం
వృత్తి : క్యాడిలా ఫార్మా సంస్థకు నగరంలో డిస్ట్రిబ్యూటర్‌
ముద్దు పేర్లు : బీజేపీ అగ్రనేతలంతా ముద్దుగా కిషన్‌ అని పిలుస్తారు‍
రాజకీయాలకు రాక ముందు : బీజేపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ కార్యాలయంలో ఉంటూనే విద్యాభ్యాసం కొనసాగించారు


రాజకీయ నేపధ్యం  : 
► ఇరవైతొమ్మిదేళ్ల కిందట అంటే 1980 లో బీజేపీ  ఆవిర్భావం నుంచి చురుకైన ​కార్యకర్తగా పనిచేస్తున్నారు
► 2004 లో హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా అరంగేట్రం 
► 2009, 2014 లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
► ఇష్టమైన ఆహారం : ఆన్నం, పెరుగు, సాంబారు

- అఖిల్ (ఎస్ ఎస్ జే)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top