దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం | BJP goal is country's development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం

May 17 2015 12:18 AM | Updated on Mar 29 2019 9:31 PM

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత బీజేపీపైనే ఉందని, కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసింది : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత బీజేపీపైనే ఉందని, కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) కార్యవర్గ సమావేశం శనివారం జీడిమెట్ల సరోజిని గార్డెన్‌లో నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న హడావిడిలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం సిగ్గు చేటన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాపథం నిర్వహించినప్పుడు అందరికి సమాచారం ఇచ్చే వారని పేర్కొన్నారు.  కేసీఆర్ మాత్రం కేవలం పార్టీ కార్యక్రమంలాగానే అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రదీప్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, దీపక్ జన్‌ఖండ్, భరతసింహారెడ్డి, వారాల మహేష్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement