
రాహుల్‌ది రాజకీయ యాత్ర
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది రైతు భరోసా యాత్రకాదని, కేవలం రాజకీయయాత్రేనని...
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుల రాంనాథ్
నిర్మల్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది రైతు భరోసా యాత్రకాదని, కేవలం రాజకీయయాత్రేనని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుల రాంనాథ్ విమర్శించారు. మండలంలోని మంజులాపూర్‌లో బుధవారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతుల కష్టాలు ఇప్పడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 3లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
రాహుల్‌గాంధీ భరోసా యాత్ర 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్లు ఉందన్నారు. జిల్లాలో 600మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం ఐదుగురికే పరిహారం అంద జేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజకీయూల కోసమే రాహుల్ భరోసా యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాళం నరేంధర్, ప్రధాన కార్యదర్శి సాయేంధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అయిండ్ల రమేష్, నాయకులు చిన్ను, పడాల సతీష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.