మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సంజన

Bigg Boss 2 Sanjana Once Again Approached Madhapur Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశిష్‌ గౌడ్‌ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్‌–2 కంటెస్టెంట్‌ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. 

కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్‌ చెప్పలేని రీతిలో  దూషించినట్టు సంజన మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్‌ చేశామని చెప్పారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్‌ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్‌ చెప్పారు.

చదవండి : నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడిపై కేసు నమోదు

ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్‌ గౌడ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top