అరక పట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌ | Bhupalpally Sub Registrar Taslima Become Farmer On Occasion Of Farmers Day | Sakshi
Sakshi News home page

అరక పట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌

Dec 24 2019 2:44 AM | Updated on Dec 24 2019 2:44 AM

Bhupalpally Sub Registrar Taslima Become Farmer On Occasion Of Farmers Day - Sakshi

ములుగు: జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా సోమవారం కూలీగా మారారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత సెలవు తీసుకున్న ఆమె తన స్వగ్రామమైన ములుగు మండలం రామచంద్రాపురానికి వచ్చారు. గ్రామానికి చెందిన రైతు దొంతి రాంరెడ్డి జగనమ్మ పొలంలో వరి నాటు పనుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మిగతా కూలీలు తెచ్చుకున్న అన్నం, పచ్చడి మెతుకులు తిన్నారు. రోజంతా పనిచేసి సాయంత్రానికి కూలి డబ్బులు తీసుకుని స్థానిక నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, వారి కష్టం తెలుసని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement