కోళ్ల పరిశ్రమకు భగీరథ నీళ్లు! | Bhagirath Water to the Poultry Industry | Sakshi
Sakshi News home page

కోళ్ల పరిశ్రమకు భగీరథ నీళ్లు!

Nov 23 2017 2:12 AM | Updated on Nov 23 2017 2:12 AM

Bhagirath Water to the Poultry Industry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, ముఖ్యమంత్రి తో మాట్లాడి కోళ్ల పరిశ్రమకు కూడా అందేలా చూస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్‌ హామీ ఇచ్చారు. పౌల్ట్రీ ఇండియా–2017 ప్రదర్శనను బుధవారం ఆయన హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, కోళ్ల పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

చిన్న రాష్ట్రమే అయినా ఏడాదికి 110 కోట్ల గుడ్లను ప్రభుత్వపరంగా విద్యార్థులు, చిన్న పిల్లలకు, అంగన్‌వాడీలకు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మధ్యా హ్నం భోజనంలో చికెన్‌ పెట్టాలని సీఎం యోచిస్తున్నారని చెప్పారు. జీఎస్‌డీపీలో రూ.10 వేల కోట్లు కోళ్ల పరిశ్రమ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎండాకాలంలో ఒక్క రోజు కరెంటు పోతే లక్షలాది కోళ్లు చనిపోయేవని, ఇప్పుడు కేసీఆర్‌ ముందుచూపు వల్ల 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని, దీంతో పరిశ్రమలకు ఉపశమ నం లభించింద న్నారు. పౌల్ట్రీని వ్యవసాయ పరిశ్రమ గా పరిగణించాలని కేంద్రాని కి లేఖ రాసిన తొలి రాష్ట్రం తెలం గాణనే అని తెలిపారు. కరెంట్‌ యూనిట్‌కి రూ.2 సబ్సిడీ ఇచ్చి రైతులకు సీఎం చేయుతని చ్చారన్నారు.

నిరుద్యోగులకు ఉపాధి
రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదని, చిన్న పరిశ్రమలు గ్రామస్థాయిలో పెట్టిం చడం ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని ఈటల అన్నారు. ఐటీ, పరిశ్రమల ద్వారా కేవలం 2–3 శాతం మాత్రమే ఉపాధి లభిస్తుందని, కోళ్ల పరిశ్రమ ద్వారా 1–2 శాతం ఉపాధి లభి స్తుందని చెప్పారు. గుడ్డు ధర పెరిగిందని, సామాన్యుడికి దూరమైందని అంటున్నారే కానీ.. ఈ పరిశ్రమతో అనుబంధం ఉన్న వారి సాధక బాధకాలు కూడా తెలుసు కోవాలని వ్యాఖ్యానించారు.

గుడ్డు సాధా రణ ధర 2016–17లో రూ.3.43 ఉంటే, 2017–18లో రూ.3.23 ఉందని చెప్పారు. ఓ చాయ్‌ రూ.10, ఓ గుట్కా, ఓ సిగరెట్‌ రూ.10 ఉన్నాయని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమ కోసం పెడుతున్న పెట్టుబడి, మానవ వనరులు, దాణా, మందుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందో గుడ్డు ధర ఆ స్థాయిలో పెరగలేదని, కాబట్టి దీనికి ప్రభు త్వాల మద్దతు అవసరమని చెప్పారు. ఈ ప్రదర్శనలో 40 దేశాలకు చెందిన కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 305 స్టాళ్లు ఏర్పాటు చేశారని కోళ్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. సేవ పోల్చమ్‌ లిమిటెడ్‌ కంపెనీ ‘ట్రాన్స్‌మూన్‌ ఐబీడీ’, ‘వెక్టార్‌మూన్‌ ఎన్‌డీ’ వ్యాక్సిన్లను ఆవిష్క రించింది. కార్యక్రమంలో పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రంజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement