వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

Beer Bottles Has Cracked Because Of Short Circuit In  Wineshop, Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట అర్బన్‌ : వైన్స్‌ షాప్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి సీసీ కెమెరాలు, ఫ్రిజ్‌ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం సిద్దిపేట అర్బన్‌ మండల పరిధిలోని ఎన్సాన్‌పల్లి గ్రామంలో జరిగింది. సిద్దిపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సాన్‌పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్‌ నిర్వహకుడు కొండం బాలకిషన్‌ గౌడ్‌  శుక్రవారం రాత్రి షాప్‌ను బంద్‌ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాప్‌ నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు షాప్‌ నిర్వహకుడికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని షాప్‌ తెరిచి చూడగా సీసీ కెమెరాల మానిటర్, ఫ్రిజ్, అందులోని మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయని గుర్తించాడు. వెంటనే ఫైర్‌ స్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై షాప్‌ నిర్వహకుడు బాలకిషన్‌గౌడ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కోటేశ్వర్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top