ఫలించిన కల | Bear with | Sakshi
Sakshi News home page

ఫలించిన కల

Oct 27 2014 3:26 AM | Updated on Sep 2 2017 3:25 PM

ఫలించిన కల

ఫలించిన కల

పాలమూరు యూనివర్సిటీ: ఆరేళ్ల కల ఫలించింది. పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)స్నాతకోత్సవానికి ఎట్టకేలకు యూజీసీ నుంచి అనుమతి లభించింది.

పాలమూరు యూనివర్సిటీ:
 ఆరేళ్ల కల ఫలించింది. పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)స్నాతకోత్సవానికి ఎట్టకేలకు యూజీసీ నుంచి అనుమతి లభించింది. నవంబర్ 29న పీయూ జరిగే (స్నాతకోత్సవం)కాన్వకేషన్‌లో పట్టభద్రులైన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాలు అందుకోనున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యార్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా యూనివర్సిటీలో కాన్వకేషన్ నిర్వహించాల్సి ఉన్నా.. యూజీసీ నుంచి అనుమతి రాకపోవడంతో ఆలస్యమైంది. ఇదిలాఉండగా, అన్నిరంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాలోని గ్రామీణప్రాంత విద్యార్థులకు ఉన్నతచదువులు అందించాలనే సంకల్పంతో 2008లో జిల్లాకేంద్రంలో పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు.

2010 వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగింది. అయితే పీయూలో ఇప్పటివరకు స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ప్రొవిజినల్ సర్టిఫికెట్ మాత్రమే పొందుతున్నారు. ఈ సర్టిఫికెట్ కొద్దికాలం మాత్రమే చెల్లుబాటు అవుతుండడంతో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగం సంపాదించే క్రమంలో పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అన్ని అడ్డుంకులు దాటుకుని వచ్చేనెల 29న జరిగే మొదటి కాన్వకేషన్‌లో వీరంతా గవర్నర్ లేదా యూనివర్సిటీ ఉపకులపతి చేతులమీదుగా డిగ్రీపట్టా పుచ్చుకోనున్నారు.

 50వేల మంది విద్యార్థులకు మేలు
 పీయూకు అనుబంధంగా 78 డిగ్రీ కళాశాలలు, 41 బీఈడీ, 12 పీజీ, ఒకటి ఎంఈడీ కళాశాల, ఒకటి ఎం ఫార్మసీ కళాశాల ఉంది. ఈ విద్యాలయాల పరిధిలో ఏటా 56,200మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఇప్పటివరకు చదువులు పూర్తిచేసుకున్న 8వేల మంది విద్యార్థులు పట్టా సర్టిఫికెట్‌ను అందుకోలేదు. పట్టభద్రులైన విద్యార్థులకు స్నాతకోత్సవం రోజున గవర్నర్ పట్టాలు అందజేస్తారు. లేదంటే యూనివర్సిటీ వీసీ పంపిణీచేస్తారు.
 
 స్థిరపడే అవకాశం దక్కింది..
 పీయూ పరిధిలో ఉన్న కళాశాలలో పట్టభద్రులైన విద్యార్థులకు కాన్వకేషన్ నిర్వహించడం సంతోషకరం. ఏటా ఎంతో మంది విద్యార్థులు పట్టభద్రులై బయటికి వెళ్తున్నారు. అంతమందికి కాన్వకేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఎంతోమంది ఉద్యోగ రీత్యా స్థిరపడే అవకాశ ం ఉంది.
 - అయ్యప్ప, ఏబీవీపీ జిల్లా కన్వీనర్  
 
 ఇబ్బంది తీరింది
 ఏటా ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ, పీజీలు పూర్తిచేసుకుని బయటికిపోతున్నారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మాత్రమే తీసుకోవడంతో ఇబ్బందిపడేవారు. ఉద్యోగాల సమయంలో డిగ్రీపట్టా సమస్య తీరింది.
 - పవన్‌కుమార్,
 పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు  
 
 పీయూ అభివృద్ధికి కృషి
 పీయూకు స్నాతకోత్సవం రావడం సంతోషకరమైన విషయం. అలాగే యూజీసీ 12- బీ, పీసీఐలు కూడా వచ్చే విధంగా త్వరలోనే చొరవతీసుకుంటాం. ఏటా యూనివర్సిటీకి అరకొరగా నిధులు విడుదల చేస్తున్నారు. అయితే యూజీసీ 12-బీ ఉంటే నిధులు అధికంగా వచ్చేందుకు అవకాశం ఉంది. - ప్రొఫెసర్ శివరాజ్, పీయూ రిజిస్ట్రార్
 
  విద్యార్థులకు మేలు
 భవిష్యత్‌లో పీయూ అభివృద్ధి కోసం మరిన్ని పనులు చేసేం దుకు కృషిచేస్తాను. గతంలో చెప్పిన విధం గా స్నాతకోత్సవానికి అనుమతి లభించింది. నవ ంబర్ 29న యూనివర్సిటీలో కాన్వకేషన్ నిర్వహిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది పేదవిద్యార్థులకు మేలు జరుగుతుంది. 

  -జి భాగ్యనారాయణ, వీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement