తస్మాత్...జాగ్రత్త...! | Be carefull | Sakshi
Sakshi News home page

తస్మాత్...జాగ్రత్త...!

Aug 31 2015 4:43 AM | Updated on Nov 6 2018 5:26 PM

తస్మాత్...జాగ్రత్త...! - Sakshi

తస్మాత్...జాగ్రత్త...!

తక్కువ ధరకు వస్తుందనో...ఒకటి కొంటే మరొక వస్తువు ఉచితంగా వస్తుందనో ఆశపడితే అసలుకే మోసపోవాల్సి వస్తుంది..

పెద్దపల్లిరూరల్ : తక్కువ ధరకు వస్తుందనో...ఒకటి కొంటే మరొక వస్తువు ఉచితంగా వస్తుందనో ఆశపడితే అసలుకే మోసపోవాల్సి వస్తుంది...కొద్ది రోజులుగా పెద్దపల్లి పట్టణంలో పేరొందిన కంపెనీల సెల్‌ఫోన్ మెమొరీ కార్డులను తక్కువ ధరకే అమ్ముతున్నట్లు నమ్మించి న ఘరానా మోసగాళ్లు పనిచేయని వాటిని అంటగట్టి అందినంత దండుకున్న విషయం వెలుగులోకి వచ్చిం ది. పెద్దపల్లి మేన్‌రోడ్డు, అమర్‌నగర్, కమాన్‌రోడ్, బ స్టాండ్ తదితర ప్రాంతాలలో ఓ ముఠా తిరుగుతూ స్మార్ట్‌ఫోన్ కలిగియున్న వినియోగదారులను గుర్తించి 32 జీబీ సామ్‌సంగ్ మెమొరీ కార్డు ధర దుకాణాల్లో దాదాపు రూ.వెయ్యి వరకు ఉంటుందని తాము కేవ లం రూ.450కే ఇస్తామంటు నమ్మించారు.

ఇంకా కొం దరికైతే కేవలం రూ.200కే విక్రయించారు. తమకు పే రొందిన కంపెనీ 32 జీబీ మెమొరీ కార్డు తక్కువ ధర కు వచ్చింద న్న సంతోషంతో మొబైల్‌లో కార్డును అమ ర్చి చూస్తే అది పనిచేయనిదని తేలడంతో మోసపోయామని గ్రహించారు. పట్టణంలో ఇలా మెమొరీకార్డుల ముఠా చేతిలో చాలా మంది మోసపోయినట్లు సమాచారం. వారిలో కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.

 గ్రామాలకు కార్లలో వచ్చి లాటరీ పేరిట అమ్మకాలు
 పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలకు కార్లలో వచ్చి రైస్ కుక్కర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి విలువైన వస్తువులున్న బొమ్మలను కార్డుపై ముద్రించి రైస్ కుక్కరు ధరను చెల్లిస్తే కుక్కరును ఇవ్వడంతో పాటు కార్డులో సూచించిన మరో వస్తువును కచ్చితంగా ఉచితంగా పొందవచ్చని ఆశజూపుతున్నారు. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు వస్తాయన్న ఆశతో లాటరీ టికెట్ తీసుకున్న వారికి నాసిరకం సీలింగ్ ఫ్యాన్లు, రైస్ కుక్కర్లను అంటగట్టారు. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి వేలాది రూపాయలను తీసుకుని నకిలీ సామగ్రిని కారులో వచ్చి అంటగడుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇప్పటికే మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, రాగినేడు, మూలసాల, భోజన్నపేట తదితర గ్రామాలకు చెందిన పలువురు మోసపోయామంటున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించి తగు చర్యలు తీసుకుని వినియోగదారులు మోసాలకు గురికాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement