ప్రగతి భవన్‌లో బతుకమ్మ వేడుకలు | Bathukamma celebrations in pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌లో బతుకమ్మ వేడుకలు

Sep 24 2017 1:52 AM | Updated on Sep 24 2017 1:53 AM

Bathukamma celebrations in pragathi Bhavan

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో శనివారం మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడారు. గవర్నర్‌ సతీమణి విమల, సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్‌ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ సుధారాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు
గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ, నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కేసీఆర్‌తోపాటు ప్రముఖ సాహితీ వేత్త నర్సింహానాయుడు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు.

సచివాలయంలో బతుకమ్మ సంబురాలు
సాక్షి, హైదరాబాద్‌: సెక్రటేరియట్‌ మహిళా ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య సచివాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. శనివారం తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుక ఆటపాటలతో హోరెత్తిపోయింది. ఈ వేడుకలో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement