కేటీఆర్‌ సెల్ఫీ.. యువతి ఫిదా

Bangalore woman selfie with kcr - Sakshi

హైదరాబాద్‌: ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో నిత్యం రద్దీగా ఉండే కింగ్‌కోఠి సిగ్నల్‌ వద్ద కేటీఆర్‌ కాన్వాయ్‌ అగింది. అక్కడే ఉన్న ఓ బెంగళూరు యువతి కేటీఆర్‌ను చూసి హాయ్‌ అంటూ విష్‌ చేసింది.

వెంటనే హాయ్‌.. అమ్మా అంటూ నవ్వుతూ ఆ యువతిని పలకరించారు. దీంతో ఆమె ‘సార్‌ మీతో ఓ సెల్ఫీ దిగొచ్చా’అని అడిగింది. సరే అంటూ మంత్రి కాన్వాయ్‌ దిగి సెల్ఫీ ఇవ్వడంతో ఆమె ఫిదా అయింది. ఈ సంఘటనను చూసిన మరికొందరూ ఆయనతో సెల్ఫీ దిగారు. సెల్ఫీ ఫొటోలను కొందరు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top