'లోకేష్ ఏ హోదాలో యూఎస్లో తిరుగుతున్నారు' | Balka suman takes on rahul and nara lokesh | Sakshi
Sakshi News home page

'లోకేష్ ఏ హోదాలో యూఎస్లో తిరుగుతున్నారు'

May 13 2015 2:01 PM | Updated on Aug 29 2018 3:37 PM

'లోకేష్ ఏ హోదాలో యూఎస్లో తిరుగుతున్నారు' - Sakshi

'లోకేష్ ఏ హోదాలో యూఎస్లో తిరుగుతున్నారు'

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టనున్న రైతు భరోసా యాత్రపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బుధవారం న్యూఢిల్లీలో స్పందించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టనున్న రైతు భరోసా యాత్రపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బుధవారం న్యూఢిల్లీలో స్పందించారు. రాహుల్ది భరోసా యాత్ర కాదని.. కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. వడగండ్ల వాన పడితే అమేథిలో పర్యటించకుండా తెలంగాణలో రాహుల్ పర్యటించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.

లోకేష్ ఏ అధికార హోదాతో ప్రత్యేక విమానాల్లో అమెరికాలో తిరుగుతున్నారని బాల్క సుమన్ ప్రశ్నించారు. అమెరికాలోని పెద్ద సంస్థలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు తెస్తున్నారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement