వాలెంటైన్స్‌ డే: భజరంగ్‌దళ్‌ కార్యకర్తల అరెస్ట్‌

Bajrang Dal Activists Stops Valentines Day Celebrations In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు. సమాచారం మేరకు కాగా పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్  కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా మిగిలిన వారైన సుభాష్, కిరణ్, దత్త సాయి, సాయి రెడ్డి, వెంకట్ మరియు తదితరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: వాలెంటైన్స్‌ డే.. ప్రేమికుల అవస్థలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top