ప్రగతి భవన్‌లోకి వెళ్లాలంటే చేతులు కడగాల్సిందే 

Authorities Should Sanitize Hands To Enter Into Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్‌లో ప్రత్యేక హ్యాండ్‌వాషింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రగతి భవన్‌లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు. మంత్రులు, సీనియర్‌ అధికారులు కార్యాలయంలోకి వచ్చే ముందు అక్కడే చేతులు కడుక్కుని, శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో మంగళవారం నాటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోనికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top