
లంచం అడిగితే.. 23454071కు కాల్ చేయండి
ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 23454071కు ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు.
వరంగల్: ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 23454071కు ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. అవినీతి పరుల తోలు తీస్తానని కేసీఆర్ హెచ్చరించారు.
ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అద్దంలాంటి సిటీగా మారుస్తానని చెప్పారు.