
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో సేవలకు గాను ఏషియావన్ మేగజైన్ ప్రకటించిన ‘ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్–2017’ అవార్డు శ్రీ చైతన్య విద్యాసంస్థలకు దక్కింది. విజేతను ప్రఖ్యాత సంస్థ ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ ఎంపిక చేసింది. సింగ పూర్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బీఎస్ రావు తరఫున అకడమిక్ డైరెక్టర్ సుష్మ అవార్డును స్వీకరించారు. ఇది తమ సంస్థ అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవమని బీఎస్ రావు పేర్కొన్నారు.