చేవెళ్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓవైసీ మద్దతు | Asaduddin Owaisi assures G Ranjit reddy in CHEVELLA constituency  | Sakshi
Sakshi News home page

చేవెళ్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓవైసీ మద్దతు

Mar 23 2019 4:17 PM | Updated on Mar 23 2019 4:21 PM

Asaduddin Owaisi assures G Ranjit reddy in CHEVELLA constituency  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీని శనివారం టీఆర్‌ఎస్‌ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జీ రంజిత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత కార్తీక్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్‌ఐఎమ్‌ పార్టీ తెలంగాణలోని 16 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తుందని ట్విట్టర్‌లో అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. చేవెళ్లలో రంజిత్‌ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.  

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీ కూటమిగా ఏర్పడకపోయినా స్నేహపూర్వకంగా ఉంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ కూడా పాత బస్తీలో అలాగే వ్యవహరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement