కౌంటింగ్‌కు పకడ్బందీ  ఏర్పాట్లు: నాగిరెడ్డి

Arrangements for the Counting of Parishad Election Says Nagi Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి అధికారులకు సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడి ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కౌంటింగ్‌ ఏర్పాట్లను సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక ర్యాండమైజేషన్‌ చేపట్టాలని, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జాయింట్‌ సెక్రటరీ జయసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నార 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top