ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య | Army employee suicide | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

Jun 25 2016 4:10 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య - Sakshi

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన వెలికట్టె సుధాకర్‌గౌడ్(24) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్నాడు.

పశ్చిమ బెంగాల్‌లో ఘటన.. మృతుడు వరంగల్ జిల్లావాసి

 కొడకండ్ల: ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన వెలికట్టె సుధాకర్‌గౌడ్(24) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్నాడు.  గ్రామానికి చెందిన  వెలికట్టె సోమయ్య-రామతార దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడైన సుధాకర్ 2012లో ఆర్మీలో డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికయ్యూడు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లో పనిచేసి, గత నెలలో పశ్చిమబెంగాల్‌కు బదిలీ అయ్యూడు. ఈ మేరకు ఉత్తర్వులు తీసుకుని నెలరోజులు సెలవు పెట్టి ఏడునూతులకు వచ్చాడు. తిరిగి ఈ నెల 18న ఇంటి నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ వెళ్లి విధుల్లో చేరాడు.

గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో క్యాంప్ బాత్‌రూంలో పైపునకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సహచరులు గమనించి అధికారులకు తెలపగా, వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నెలరోజులపాటు అందరితో సరదాగా గడిపి వెళ్లిన తమ కుమారుడు.. విధుల్లో చేరిన తెల్లవారే ఆత్మహత్య చేసుకున్నాడనే విషయూన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని శనివారం హైదరాబాద్‌కు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement