పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి | Arjunreddy says sorry to hyderabad police | Sakshi
Sakshi News home page

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి

Jan 21 2018 5:04 PM | Updated on Jan 21 2018 5:07 PM

Arjunreddy says sorry to hyderabad police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పోలీసులకు అర్జున్‌ రెడ్డి సారీ చెప్పారు. అదేంటనుకుంటున్నారా ? అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఫుట్‌ బాల్‌ గేమ్‌ ఆడటానికి స్పోర్ట్స్‌ డ్రెస్‌లోనే హెల్మెట్‌ లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్‌ బైక్‌పై స్మోక్‌ చేస్తూ వెళ్లే ఓ సీన్‌ మనందరికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే హెల్మెట్‌ ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడానికి హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే అర్జున్ రెడ్డి పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ హెల్మెట్‌ ధరించకుండా ఉన్న ఫోటోను, గ్రాఫిక్స్‌ సహాయంతో అదే ఫోటోకు హెల్మెట్‌ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల్లో ఏది సరైంది, ఏది తప్పు అనేది కూడా టిక్‌ పెట్టి ఓ ఫోటోను హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్విట్ చేశారు. ప్రపంచంలో ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో దాదాపు సగం మంది ద్విచక్ర వాహనాలు నడిపేవారే. వీరిలోనూ తలకు బలమైన గాయాలు తగలడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరీ ఎక్కువగా వున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే స్కూటర్లు, బైక్ లు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం ఆయా కుటుంబాలను అంతులేని విషాదంలోకి ఈడ్చుకెళ్తోంది. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం అనే ఒకే ఒక్క పొరపాటు ప్రతి రోజూ కొన్ని వందల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. దీంతో తలకు గాయాలవ్వడం వల్లే ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు మృతిచెందుతున్నారని ట్విట్టర్‌లో అర్జున్‌ రెడ్డి ఫోటోతో పాటూ పోస్ట్ చేశారు. దీనికి బదులుగా సారీ మామా.. ఇప్పటి నుంచి పక్కా అంటూ విజయ్‌ దేవరకొండ ఓ ట్విట్‌ చేశారు.

ట్రాఫిక్‌ నిబంధనలను పాటించండి అంటూ తమఫాలోవర్లకు అర్జున్ రెడ్డి చిత్రంలోని మరో ఫోటో ద్వారా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ఇందులో అర్జున్ రెడ్డి, చిత్రంలోని మరో పాత్ర అమిత్‌ సహాయంతో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి అంటూ మరో ట్విట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement