ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష | APRJC-APRDC exams completed | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

May 13 2014 4:42 AM | Updated on Sep 2 2017 7:16 AM

ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు 8,168 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 755 మంది గైర్హాజరు అయ్యారు

 మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు 8,168 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 755 మంది గైర్హాజరు అయ్యారు. 7,413 మంది హాజరయ్యారు. ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షకు 521 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 476 మంది విద్యార్థులు హాజరయ్యారు. 45 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 8689 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 7,889 మంది విద్యార్థులు హాజరయ్యారు. 800మంది గైర్హాజరు అయ్యారు. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్, డైట్ కళాశాల తది తర పరీక్ష కేంద్రాలను డీఈఓ చంద్రమోహన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement