‘బీసీ’ రుణాలకు దరఖాస్తు చేసుకోండి | Apply for 'BC' loans | Sakshi
Sakshi News home page

‘బీసీ’ రుణాలకు దరఖాస్తు చేసుకోండి

Mar 30 2018 12:33 PM | Updated on Aug 20 2018 3:21 PM

Apply for 'BC' loans - Sakshi

సుధాకర్, ఎంపీడీఓ  

యాలాల: బీసీ కార్పొరేషన్‌లో వ్యక్తిగత రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ సుధాకర్‌ గురువారం తెలిపారు. ఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌లో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచి ంచారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలకు రూ. 1.50 లక్షల వార్షిక ఆదాయం ఉండి 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వా రు అర్హులని చెప్పారు. మీసేవ ద్వారా పొంది న కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్‌ జి రాక్సుతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరిం చారు.

వ్యవసాయ ఆధారిత, పాడి పశువులు, చిన్న నీటిపారుదల, వ్యక్తిగత స్వయం ఉపా ధి విభాగాల్లో రుణాల కోసం దరఖాస్తు చేసు కునే అవకాశం ఉందని తెలిపారు. యూనిట్‌ వి లువ రూ.1లక్ష అయి తే 80 శాతం, రూ.2 లక్షలు ఉంటే 70శాతం, రూ .2.1 నుంచి రూ.12లక్షల వరకు ఉంటే 60శా తం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మండ ల పరిధిలోని బీసీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement