వీడియోలకు తాళం వేద్దాం

App Lock For Kids Youtube Channels - Sakshi

అశ్లీలానికి అడ్డుకట్ట వేసేందుకు

యూట్యూబ్‌లో కిడ్స్‌ యాప్‌  

సాక్షి,సిటీబ్యూరో:  నేటి పిల్లలు చదువులో భాగంగా పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వస్తోంది. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైతం పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి అంతర్జాలాన్ని ఆశ్రయిస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి విషయ అవగాహన పెంచుకుంటున్నారు. కార్టూన్‌ వీడియోలను పిల్లలు ఇష్టంగా చూస్తుంటారు. ఈ క్రమంలో అశ్లీల వీడియోల తాకిడి ఎక్కువ కావడంతో చిన్నారులకు ఫోన్‌ ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తుంటారు. దీనికి పరిష్కారంగా యూట్యూబ్‌ ప్రత్యేక అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా తల్లిదండ్రులు ఎంపిక చేసిన వీడియోలు మాత్రమే చిన్నారులు చూసే విధంగా సెట్‌ చేసుకునే వీలుందనేది చాలామందికి తెలియదు. యూట్యూబ్‌ కిడ్స్‌ పేరుతో అప్లికేషన్‌ను చాలాకాలం క్రితమే యూట్యూబ్‌ విడుదల చేసింది. ఇందులో కేవలం పిల్లలకు సంబంధించిన వీడియోలు మాత్రమే లభిస్తాయి. ఈ అప్లికేషన్‌కు ఇప్పుడు మరో సదుపాయాన్ని జత చేసింది.

కొత్త సెట్టింగుతో ప్రయోజనం ఇది..  
యూట్యూబ్‌లో ఉంటే అన్ని వీడియోలను పిల్లలు చూడకుండా కేవలం తల్లిదండ్రులు ఎంపిక చేసిన కొన్ని వీడియోలను మాత్రమే వారు చూసే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వారి వయసుకు తగిన వీడియోలను ముందుగానే ఎంపిక చేసి అందుబాటులో ఉంచవచ్చు. అవసరంలేని వాటిని తొలగించుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడుతున్న వారికి ఈ సదుపాయం అందుబాటులో వచ్చింది. యూట్యూబ్‌ కిడ్స్‌ అప్లికేషన్‌లో ఛైల్డ్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లి అప్రూవ్డ్‌ కంటెంట్‌ ఓన్లీ అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. వీడియోలను ఎంపిక చేసుకోవడం ఇబ్బందిగా భావించేవారు... పిల్లల కోసం వీడియోలను అందించే నమ్మకమైన ఛానెళ్ల నుంచి ప్లే లిస్టులను ఎంపిక చేసుకోవచ్చు. పిల్లలకోసం ఈ ప్రత్యేకమైన అప్లికేషన్‌ వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా తల్లిదండ్రులకు దీనిపై అంత అవగాహన లేదు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే చిన్నారులకు మరింత విజ్ఞానాన్ని అందించేందుకు తోడ్పడవచ్చు.  

ఇలాంటి అప్లికేషన్స్‌పై అవగాహన అవసరం
ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వివాదం రోజుకొకసారైన ఎదురవుతుంది.ముఖ్యంగా తల్లులు ఎదుర్కొనే ప్రాధాన సమస్య. చూస్తూ చూస్తూ పిల్లలకు ఫోన్‌ ఇస్తే యూట్యూట్‌లో ఉండే వివిధ రకాల వీడియోలు పిల్లలు చూసే అవకాశం ఉంది. ఈ ప్రాధాన సమస్య నుంచి తల్లిదండ్రులను గడ్డేక్కించేందుకు యూట్యూబ్‌ కిడ్స్‌ అప్లికేషన్‌లో ఛైల్డ్‌ ప్రొఫైల్‌లోని అప్రూవ్డ్‌ కంటెంట్‌ ఓన్లీ అనే ఆప్షన్‌ ఎంతో ఉపయోగకారిగా ఉంటోంది. దీన్ని పెద్దలు ఎంపిక చేసుకుంటే సమస్య పరిష్కారం అయినట్లే. ఇలాంటి అప్లికేషన్స్‌పై ముఖ్యంగా మహిళలకు అవగాహన అవసరం.
– అరుణ, ఉపదృష్ణ, సాయి అలేఖ్య సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ.

పిల్లలకు అవసరమైన వీడియోలే ఇవ్వొచ్చు
యూట్యూబ్‌లో ఉండే అన్ని వీడియోలను పిల్లలు చూడకుండా కట్టడి అవసరం. పిల్లలు ఎక్కువ తమ తమ సబ్జెక్టుకు సంబంధించి అదనపు సమాచారం కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగమైంది. ఈ క్రమంలో వారు అశ్లీల వీడియోలు చూసే అవకాశాలు లేక పోలేదు. ప్రతి కుటుంబంలో చదువుకొనే విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వారికి ఇవ్వాలంటే జక్కుతున్నారు. ఇస్తే ఏమౌతుందోనని భయం. ఇవ్వకుండా ఉండనూ లేరు. కేవలం పిల్లలు కొత్త సెట్టింగులతో కూడిన, సరికొత్త ఆప్లికేషన్స్‌ మరిన్ని రావాలి. వాటి గురించి క్షుణ్ణంగా తెలిసిరావాలి. ఇలాంటివి మరిన్ని వస్తే  పిల్లలకు అవసరమైన వీడియోలే ఇచ్చేందుకు వీలు అవుతుంది. – అలేఖ్యా సుషీల్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top