ఆప్‌ అభ్యర్థిగా సిరాజొద్దీన్‌  | APP Candidate Sirajuddin In Nizamabad | Sakshi
Sakshi News home page

ఆప్‌ అభ్యర్థిగా సిరాజొద్దీన్‌ 

Nov 14 2018 5:54 PM | Updated on Nov 14 2018 5:56 PM

APP Candidate Sirajuddin In Nizamabad - Sakshi

మాట్లాడుతున్న  డాక్టర్‌ సిరాజొద్దీన్‌ 

సాక్షి,నిజామాబాద్‌ అర్బన్‌: ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తానని రిటైర్డ్‌ జిల్లా వైద్యాధికారి సిరాజొద్దీన్‌ పేర్కొన్నారు. మంగళవారం  తన నివాసంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఆమ్‌ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు న చ్చాయని ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆ సిద్ధాంతాల ప్రకారం ప్రజా సేవ చేస్తానన్నారు.

అందుకు పార్టీ తరపున నిజామాబాద్‌ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఎంతో అద్భుతంగా ప్రజాసేవ చేస్తున్నాడని ముఖ్యంగా అవినీతిని రూపుమాపడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు రోజుల్లో బీ–ఫాం అందుతుం దని అనంతరం నామినేషన్‌ దాఖలు చేస్తానన్నా రు. ఈ సమావేశంలో ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన జిల్లా నాయకులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement