ఎవరైనా సరే.. రూల్ ఫర్ ఆల్! | Anyone .. Rule for All! | Sakshi
Sakshi News home page

ఎవరైనా సరే.. రూల్ ఫర్ ఆల్!

Aug 7 2014 12:56 AM | Updated on Aug 17 2018 2:53 PM

స్పెషల్ డ్రైవ్‌లో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్ హడలెత్తించారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని కూడళ్లలో పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేశారు.

ఆదిలాబాద్ క్రైం : స్పెషల్ డ్రైవ్‌లో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్ హడలెత్తించారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని కూడళ్లలో పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఏఎస్పీ స్వయంగా రోడ్డుపై వాహనాలు ఆపుతూ నంబర్‌ప్లేట్, పత్రాలు లేని పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేసి ఆర్టీవో ఆఫీస్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట సిగ్నల్ పడిన సమయంలో ఆగిన వాహనాలు సైతం తనిఖీలు చేశారు.

నాలుగు రోజుల ముందే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. వాహనదారులు అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పత్రాలు లేకుండా చాలామంది వాహనదారులు అడ్డంగా దొరికిపోయారు. ప్రతి రోజు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపడుతామని ఏఎస్పీ తెలిపారు. వాహనదారులు పత్రాలు వెంటే ఉంచుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్‌తో నేరాల అదుపునకు కృషి చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement