హెల్మెట్‌..హెల్మెట్‌..! | All Two Wheeler Vehicle Persons Helmet Karimnagar Police | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌..హెల్మెట్‌..!

Feb 1 2019 12:50 PM | Updated on Feb 1 2019 1:05 PM

All Two Wheeler Vehicle Persons Helmet Karimnagar Police - Sakshi

కరీంనగర్‌బిజినెస్‌: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మ్‌ట్‌ ధరించాలని గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో కొంత కాలమే అమలయ్యింది. పోలీసులు సైతం పలు మార్లు హెల్మెట్‌ నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు హెల్మెట్‌ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరిం చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెల్మెట్‌ ధరించడంపై ప్రచారం చేపట్టారు.

తల మీదే.. రక్షణ మీదే.. 
హెల్మెట్‌ ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హెల్మెట్‌ ఉపయోగపడుతుంది. మెట్రో నగరాల్లో హెల్మెట్‌ వాడకం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో కరీంనగర్‌లో పలుమార్లు అమలు చేసినా అది కొనసాగలేదు. కానీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా హెల్మెట్‌ వాడాలని కరీంనగర్‌ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ‘తల మీదే... రక్షణ మీదే...’ నినాదంతో విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

హెల్మెట్‌లకు ఫుల్‌ గిరాకీ...
పోలీసులు ఫిబ్రవరి 1నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరని సూచించడంతో హెల్మెట్‌ లేని వాహనదారులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. కొంతమంది ఆన్‌లైన్‌లో వివిధ రకాల మోడల్స్‌ వెతుకుతుండగా, మరికొంత మంది నగరంలోని షాపుల్లో సరికొత్త మోడల్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని కమాన్, కోతిరాంపూర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆటోస్టోర్స్‌ దుకాణాలు సహా బస్టాండ్, కమాన్, తెలంగాణచౌక్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, కోర్టురోడ్డు, ఎస్సారార్‌ కాలేజీ రోడ్, ఆర్టీసీ వర్క్‌షాప్‌ ప్రాంతాల్లో హెల్మెట్లు అమ్ముతున్నారు. అలాగే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ రోడ్, సిరిసిల్ల రోడ్, జగిత్యాల రోడ్డు, గోదావరిఖని రోడ్లలో ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌ దుకాణాలు వెలిశాయి. శుక్రవారం నుంచి హెల్మెట్‌ యాక్టు అమలు చేస్తుండడంతో గత వారం రోజులుగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని దుకాణాదారులు తెలిపారు. మునుపెన్నడూ లేనివి«ధంగా భారీగా హెల్మెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం.

సరికొత్త రకాల హెల్మెట్‌లు...
నగరంలోని దుకాణాలు, ఫుట్‌పాత్‌ షాపుల్లో సాధారణ హెల్మెట్లతో పాటు స్పోర్ట్స్, షార్ట్‌ హెల్మెట్, ఓపెన్‌ పేస్‌ హెల్మెట్, ఫుల్‌ఫేస్‌ హెల్మెట్, ఫ్లిప్‌ అప్‌ హెల్మెట్‌ వంటి వివిధ రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు హెల్మెట్లు నాణ్యతను బట్టి రూ.350 నుంచి రూ.2000లకు పైగానే లభిస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. ఐఎస్‌ఐ మార్క్‌తో పాటు నాణ్యమైన హెల్మెట్‌ వాడితేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా కరీంనగర్‌ వాసులు చాలా మంది హెల్మెట్లను ఆర్డర్‌ చేస్తున్నారు. దాదాపు గత 15 రోజుల నుంచి సుమారు రూ.కోటి వరకు వ్యాపారం జరిగిందని అంచనా.

ఈ నెల 1వ తేదీ నుంచి కరీంనగర్‌లో హెల్మెట్‌ యాక్టు అమలు చేస్తున్నాం. ప్రమాదానికి గురైనప్పుడు ద్విచక్ర వాహనదారులు కిందపడగా ముందుగా తలకే గాయాలవుతాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. తల మనదే... రక్షణ మనదే అన్న సంగతి మరువరాదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement