పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన | aged concern for pensions | Sakshi
Sakshi News home page

పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన

Nov 25 2014 3:11 AM | Updated on Oct 4 2018 5:35 PM

పింఛన్లు రావడం లేదని సోమవారం మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ...

జక్రాన్‌పల్లి: పింఛన్లు రావడం లేదని సోమవారం మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వృద్ధులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలో చాలా మందికి పింఛన్లు రాలేదని పేర్కొంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.

సర్పంచ్ సాయన్న,ఉపసర్పంచ్ రమేష్‌లను ఇరవై నిమిషాల పాటు గదిలో నిర్బం ధించి నిరసన వ్యక్తం చేశారు.  అర్హులైనప్పటికీ తమకు పింఛన్ జాబితాలో పేరు లేదని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా మంది పింఛన్లను అధికారులు తొలగించారని ఆరోపించారు. అర్హులైన తమకు పింఛన్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement