‘ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేస్తున్న సీఎం’

Adivasis Says kCR Suppressed Adivasi Movement - Sakshi

లంబాడా కులస్తులకు వత్తాసు

 నార్నూర్‌ సభ తర్వాత ఉద్యమం తీవ్రతరం చేస్తాం

ఆదివాసీ సంఘాల నాయకులు

సాక్షి,ఆసిఫాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆదివాసీ ఉద్యమాన్ని అణగదొక్కుతూ, లంబాడాలకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెస్రం మోతీరాం, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాయిసెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో లంబాడాలతో సమావేశం నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేశారు.

ఆదివాసీల సమస్యను పక్కన పెట్టి గ్రామ పంచాయతీల పేరుతో తండాలకు ప్రాధాన్యం కల్పించడం బాధాకరమన్నారు. గత నాలుగు నెలలుగా ఆదివాసీ ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోఛనీయమని పేర్కొన్నారు. టీఆర్టీలో లంబాడాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని డిమాండ్‌ చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా  ఈ నెల 9న నార్నూర్‌లో పెద్ద ఎత్తున ఆదివాసీ  బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశానికి ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఏటీఈ జిల్లా అధ్యక్షుడు కొట్నాక తెలంగరావు, ప్రధాన కార్యదర్శి కొట్నాక ప్రవీణ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడం గోపీచంద్, ఏవీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి కొట్నక గణపతి, సంఘ నాయకులు మడావి గణవంత్‌రావు, కొట్నాక మెహపత్‌రావు, వెడ్మ బాదు పటేల్, సుధాకర్, ఆత్రం అనిల్, సిడాం శంకర్‌ పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top