ఫిరాయింపులపై చర్యలకు ఆదేశాలివ్వండి | Acts of defection adesalivvandi | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై చర్యలకు ఆదేశాలివ్వండి

Mar 20 2015 1:15 AM | Updated on Aug 31 2018 8:24 PM

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఫిర్యాదుపై తక్షణమే నిర్ణయం...

  • హైకోర్టులో కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ పిటిషన్
  • సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఫిర్యాదుపై తక్షణమే నిర్ణయం వెలువరించేలా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్‌కుమార్ హై కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కాలె యాదయ్య, డి.ఎస్.రెడ్యానాయక్, జి.విఠల్‌రెడ్డి, కనకయ్యలు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు.

    పార్టీ ఫిరాయించిన వీరిపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది ఆగస్టులో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై స్పీకర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమ వ్యాజ్యాలపై తగిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని సంపత్‌కుమార్ పిటిషన్‌లో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement