‘ఆక్టెవ్’.. అదుర్స్ | Active...adhurs | Sakshi
Sakshi News home page

‘ఆక్టెవ్’.. అదుర్స్

Dec 22 2014 2:18 AM | Updated on Sep 2 2017 6:32 PM

షాద్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్‌హాల్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ, దక్షిణ భారత సాంస్కృతికశాఖ తంజావూరు వారు, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ

ఆక్టెవ్- 2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈశాన్యరాష్ట్రాల కళాకారుల ప్రదర్శలను ఔరా అనిపించాయి. నాగాలాండ్‌కు చెందిన చిన్నారులు వారియర్స్ డ్యాన్స్, మణిపూర్ విద్యార్థులు లయహోరాబా నృత్యం, లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెందిన కళాకారుల పాంతోయబి, నోంగ్‌పాంక్ కళారూపాలు భళా అని పించాయి. అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థుల గాసోస్య నృత్యం.. మిజోరాం కాళాకారుల చెరావ్  నాట్యం
 కనువిందు చేసింది.  
 
 షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్‌హాల్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ, దక్షిణ భారత సాంస్కృతికశాఖ తంజావూరు వారు, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక మండ లి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఆక్టెవ్-2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేఘాలయా, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల కళాకారుల కళారూపాలు రూపరులను అలరించాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల జానపద నృత్యా లు భళా అనిపించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద, అవి దేశానికి ప్రతీకలని అన్నా రు. సంస్కృతిని ముందుతరాల వారికి తెలి యజేసేందుకు  ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు.
 
  తెలంగాణలో షాద్‌నగర్, వరంగల్, హైదరాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాం తాల సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. అలాంటి సంప్రదాయాలను అన్ని ప్రాంతాల వారికి తెలిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.  తెలంగాణ బోనాలు, బతుకమ్మ రాష్ట్ర ఔన్నత్యం చాటుతాయన్నారు. ఏజే సీ రాజారాం, తహశీల్దార్ చందర్‌రావు. ఎంఈఓ శంకర్‌రాథోడ్, మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, ఎంపీపీ బుజ్జినాయక్ పాల్గొన్నారు.
 
 ఆకట్టుకున్న జానపద నృత్యాలు
 తెలంగాణకు చెందిన వివిధ వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ విద్యార్థులు చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. నాగాలాండ్ చిన్నారులు వారి యర్స్ డ్యాన్స్‌ను ప్రదర్శించారు. మణిపూర్ విద్యార్థులు లయహోరాబా పండుగ గురిం చి,లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెంది న దేవతలు పాంతోయబి, నోంగ్‌పాంక్ ఒకరినొకరు కలిసే వేళ నృత్యాన్ని ప్రదర్శించా రు. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులు గాసోస్య నృత్యం చేయగా.. మిజోరాం విద్యార్థులు చెరావ్ అనే నృత్యాన్ని ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement