breaking news
functin hall
-
వధువు పరార్... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..
మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘ఆక్టెవ్’.. అదుర్స్
ఆక్టెవ్- 2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈశాన్యరాష్ట్రాల కళాకారుల ప్రదర్శలను ఔరా అనిపించాయి. నాగాలాండ్‌కు చెందిన చిన్నారులు వారియర్స్ డ్యాన్స్, మణిపూర్ విద్యార్థులు లయహోరాబా నృత్యం, లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెందిన కళాకారుల పాంతోయబి, నోంగ్‌పాంక్ కళారూపాలు భళా అని పించాయి. అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థుల గాసోస్య నృత్యం.. మిజోరాం కాళాకారుల చెరావ్ నాట్యం కనువిందు చేసింది. షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్హాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ, దక్షిణ భారత సాంస్కృతికశాఖ తంజావూరు వారు, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక మండ లి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఆక్టెవ్-2014 ఉత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేఘాలయా, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల కళాకారుల కళారూపాలు రూపరులను అలరించాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల జానపద నృత్యా లు భళా అనిపించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద, అవి దేశానికి ప్రతీకలని అన్నా రు. సంస్కృతిని ముందుతరాల వారికి తెలి యజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు. తెలంగాణలో షాద్‌నగర్, వరంగల్, హైదరాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాం తాల సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. అలాంటి సంప్రదాయాలను అన్ని ప్రాంతాల వారికి తెలిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తెలంగాణ బోనాలు, బతుకమ్మ రాష్ట్ర ఔన్నత్యం చాటుతాయన్నారు. ఏజే సీ రాజారాం, తహశీల్దార్ చందర్రావు. ఎంఈఓ శంకర్‌రాథోడ్, మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, ఎంపీపీ బుజ్జినాయక్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న జానపద నృత్యాలు తెలంగాణకు చెందిన వివిధ వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరిస్తూ విద్యార్థులు చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. నాగాలాండ్ చిన్నారులు వారి యర్స్ డ్యాన్స్‌ను ప్రదర్శించారు. మణిపూర్ విద్యార్థులు లయహోరాబా పండుగ గురిం చి,లంగ్ మై చింగ్ కొండ ప్రాంతానికి చెంది న దేవతలు పాంతోయబి, నోంగ్‌పాంక్ ఒకరినొకరు కలిసే వేళ నృత్యాన్ని ప్రదర్శించా రు. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులు గాసోస్య నృత్యం చేయగా.. మిజోరాం విద్యార్థులు చెరావ్ అనే నృత్యాన్ని ప్రదర్శించారు.