వధువు పరార్‌... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..

bride ran away before the wedding came home after 13 days - Sakshi

మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు.

మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్‌ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు.

ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది.

అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top