వినాయక నిమజ్జనంలో అపశ్రుతి | accidentally man dies after participate in vinayaka immersion | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

Sep 28 2015 12:25 PM | Updated on Apr 3 2019 7:53 PM

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

చేవెళ్లరూరల్(రంగారెడ్డి జిల్లా): వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఓ యువకుడు అదుపు తప్పి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాన్ని ఆదివారం రాత్రి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం యువకులంతా ట్రాక్టర్‌లో వస్తుండగా సురేశ్(19) ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అతనిపైనుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement