చెక్పోస్ట్పై ఏసీబీ దాడి: ఏఎంవీఐ అరెస్ట్ | ACB Seizes Rs.12 thousand in Raids on RTA Checkposts in Nizamabad | Sakshi
Sakshi News home page

చెక్పోస్ట్పై ఏసీబీ దాడి: ఏఎంవీఐ అరెస్ట్

Aug 14 2014 9:53 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్పోస్ట్పై గురువారం తెల్లవారుజామున అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్పోస్ట్పై గురువారం తెల్లవారుజామున అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర వద్ద అక్రమంగా ఉన్న రూ.12 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం రవీంద్రను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

పొందుర్తి ఆర్టీఏ చెక్పోస్ట్  సిబ్బంది వాహనదారుల నుంచి అధిక మొత్తంలో నగదు వసూల్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలువురు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున సదరు ఆర్టీఏ చెక్పోస్ట్పై దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement