కుటుంబ వివరాలపై ఈనెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర సర్వేకు సర్వం సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- సర్వేకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు రేమండ్ పీటర్ ఆదేశాలు
రాంనగర్ : కుటుంబ వివరాలపై ఈనెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర సర్వేకు సర్వం సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవా రం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చి కుటుంబ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు ప్రజలందరూ సహకరించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం కంటే ఎక్కు వ కుటుంబాలు నివసిస్తున్నట్లయితే వారికి ఆయా ఇంటి నెంబర్ల కోసం తాత్కాలిక సంఖ్య ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులను చేరుకునేందుకు వాహన సదుపా యం కల్పించాలన్నారు.
ఎన్నికల విధులకు రూట్ మ్యాప్‌లు ఉపయోగించిన విధంగానే కుటుంబ సర్వేకు కూడా రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. సర్వే అనంతరం వివరాలు నమోదు చేయడానికి అవసరమైన కంప్యూటర్లు, ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని తెలి పారు. కంప్యూటర్లలో వివరాల నమోదును ఒక ప్రదేశం నుంచే కాకుండా అనుకూలంగా ఉన్న కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లు, కళాశాలలు, పాఠశాలల నుంచి నేరుగా ఎంట్రీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఎన్యుమరేటర్ల గుర్తింపు పూర్తి
కుటుంబ సామాజిక వివరాలపై సమగ్ర సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లను గుర్తించి వారికి శిక్షణ పూర్తి చేసినట్లు రేమండ్ పీటర్‌కు జిల్లా కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. ఆలేరుకు విచ్చేసిన కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్ల చొప్పున కేటాయించామన్నారు. పింఛన్ పొందు తున్న వారి వివరాలు, ఇళ్ల మంజూరు వివరాలు, ల్యాండ్ రికార్డులు, సదరన్ క్యాంప్ లబ్ధిదారుల వివరాలు మొదలగునవి సరి చూసుకుని సర్వే చేసినట్లయితే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయని అధికారులకు వివరించినట్లు కలెక్టర్ చెప్పారు.
సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకొని నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, ఆలేరు నుంచి వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ రాంమ్మూర్తి, ప్రత్యేక అధికారి యాదగిరి, ఏడీఏ వెంకటేషం, ఇన్‌చార్‌జ ఎంపీడీఓ వెంక టరమణ తదితరులు పాల్గొన్నారు.