9999 @ రూ.5.12 లక్షలు | 9999 @ Rs .5.12 lakh | Sakshi
Sakshi News home page

9999 @ రూ.5.12 లక్షలు

Oct 22 2014 2:29 AM | Updated on Sep 2 2017 3:13 PM

ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు.

- ఫ్యాన్సీ నంబర్లకు భలే డిమాండ్
- ఒక్క రోజులోనే ఆర్టీయేకు రూ.10.52 లక్షల ఆదాయం

సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు.మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో పలు నంబర్లకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ‘టీఎస్ 09 ఈఏ 9999’ నంబర్‌ను టెక్‌ట్రీ సాఫ్ట్‌వేర్ సంస్థ 5,12,95 రూపాయలకు దక్కించుకుంది. రూ.75.26 లక్షల ఖరీదైన డైమ్లర్ కారు కోసం ఈ నెంబర్ తీసుకుంది.

ఆర్‌ఎన్ ఎంటర్‌ప్రైజెస్ లక్షా 760 రూపాయలు చెల్లించి జాగ్వార్ వాహనానికి ‘టీఎస్ 09 ఈఏ 0001’ నంబర్‌ను కైవసం చేసుకుంది. రాజేశ్వర్‌రెడ్డి అనే వాహనదారుడు రూ.66 వేలు చెల్లించి ‘టీఎస్09 ఈఏ0666’ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా 10 లక్షల 52 వేల 655 రూపాయల ఆదాయం వచ్చినట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement