పీజీఈసెట్‌లో 88.27% అర్హత 

88 Percent above eligibility for PGECET - Sakshi

ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్‌–డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 19 రకాల సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాలను https://pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.

గత నెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20,415 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 17,722 మంది హాజరయ్యారని చెప్పారు. వారిలో 15,644 మంది (88.27 శాతం) అర్హత సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల ప్రవేశా ల్లో ముందుగా గేట్, జీప్యాట్‌లో అర్హ త సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తామని, ఆ తర్వాత పీజీఈసెట్‌ వారి కి ప్రవేశాలుంటాయని ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం తెలిపారు. 

జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్‌.. 
ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ జూలైలో ఉంటుందని పీజీఈసెట్‌ కన్వీనర్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెలాఖరుకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రవేశాల కమిటీ సమావేశమై కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top