రోడ్లకు కావాలి రూ.866 కోట్లు | 866crore want to road repair's | Sakshi
Sakshi News home page

రోడ్లకు కావాలి రూ.866 కోట్లు

Sep 29 2016 2:56 AM | Updated on Sep 4 2017 3:24 PM

రోడ్లకు కావాలి రూ.866 కోట్లు

రోడ్లకు కావాలి రూ.866 కోట్లు

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,170 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రోడ్లు భవనాల శాఖ గుర్తించింది.

వర్షాల నష్టం అంచనా రూపొందించిన రోడ్లు భవనాల శాఖ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,170 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రోడ్లు భవనాల శాఖ గుర్తించింది. నష్టం దాదాపు రూ.866 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్రప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ అధికారులతో బుధవారం చర్చించారు. వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement