ఒక వాహనం.. 73 చలాన్లు | 73 Pending Challans on Two Wheeler in Hyderabad | Sakshi
Sakshi News home page

ఒక వాహనం.. 73 చలాన్లు

Apr 26 2019 8:00 AM | Updated on Apr 26 2019 8:00 AM

73 Pending Challans on Two Wheeler in Hyderabad - Sakshi

చలాన్లు చూపుతున్న వాహనదారుడు

సనత్‌నగర్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది కాదు అంతకంటే కాదు.. ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 73 పెండింగ్‌ చలాన్లు ఉండడం ట్రాఫిక్‌ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్‌ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం మహంకాళి పోలీసులు సోదాలు చేస్తుండగా ఏపీ 09 సీడబ్లు్య 6418 నెంబర్‌ బైక్‌పై ఉన్న చలాన్లను ఆన్‌లైన్‌లో చెక్‌ చేశారు. దీంతో 73 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడి నుంచి మొత్తం రూ.13,120 పోలీసులు వసూలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement