మోహన్‌బాబును కలిసిన సురుచి ఫుడ్స్‌ ప్రతినిధి   | 600 kg Laddu To Vinayaka In Dyvasannidhanam | Sakshi
Sakshi News home page

దైవసన్నిధానం గణనాథుడికి 600 కిలోల మహాలడ్డూ 

Jul 7 2018 9:24 AM | Updated on Jul 7 2018 9:24 AM

600 kg Laddu To Vinayaka In Dyvasannidhanam - Sakshi

దైవసన్నిధానం చైర్మన్‌ మోహన్‌బాబును కలిసిన సురుచి ఫుడ్స్‌ ప్రతినిధి  

హైదరాబాద్‌: త్వరలో జరిగే వినాయక చవితి కి ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసే గణనాధుడికి 600 కిలోల మహాలడ్డూ సమర్పించనున్నట్లు తాపేశ్వరం కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్‌ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దైవసన్నిధానం చైర్మన్‌ మోహన్‌బాబుతో తమ ప్రతినిధి సమావేశమై ఈ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు.

గతేడాది కూడా దైవసన్నిధానం వినాయక చవితి ఉత్సవాలకు 500 కిలోల లడ్డూను అందజేసినట్లు తెలిపారు. తమ ప్రతినిధి వర్మ మోహన్‌బాబుతో కలిసినప్పుడు ఇందుకు సంబంధించిన లడ్డూ డిజైన్‌ను, ఎప్పుడు లడ్డూను సమర్పించే తదితర వివరాలు వెల్లడించారన్నారు. 2010 నుంచి ఖైరతాబాద్‌ గణేషుడికి మహాలడ్డూను సమర్పిస్తూ వచ్చిన తాము భద్రతా కారణాల వల్ల నిలిపివేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement