నాటు కోళ్ల ఫారంపై కుక్కల దాడి | 600 Chickens Killed By Dogs | Sakshi
Sakshi News home page

600 కోళ్లను కొరికి చంపిన కుక్కలు

Jul 12 2018 10:38 AM | Updated on Sep 29 2018 3:55 PM

 600 Chickens Killed By Dogs - Sakshi

కుక్కల దాడిలో చనిపోయిన నాటు కోళ్లు

చేర్యాల(సిద్దిపేట): నాటు కోళ్ల పారంపై కుక్కలు దాడి చేసి 600 నాటు కోళ్లను చంపిన ఘటన బుధవారం మండల పరిధిలో దానంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రైతు మల్లారెడ్డికి గ్రామ శివారులో గ్రామప్రియ నాటు కోళ్ల ఫారం ఉంది. రోజువారీగా మంగళవారం రాత్రి కోళ్ల ఫారంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి బుధవారం ఉదయం కోళ్ల ఫారానికి వచ్చి చూడగా కోళ్లన్నింటినీ కుక్కలు కొరికి చంపినట్టు గుర్తించాడు.

దీంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, ఘటన తెలుసుకున్న చేర్యాల ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డితో కలిసి బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement