నగరంలో భారీ దోపిడి | 5 kg gold stolen in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో 5 కేజీల బంగారం చోరీ

Mar 6 2018 5:08 PM | Updated on Sep 4 2018 5:07 PM

5 kg gold stolen in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చార్మినార్‌ పేట్లబురుజు సమీపంలో భారీ దోపిడి చోటుచేసుకుంది. ఓ నగల తయారీ కేంద్రంలో 5 కిలోల బంగారాన్ని అపహరించారు. పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దోపిడి సమయంలో 20 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పాడు. ఒక్కసారిగా పది మంది కత్తులతో వచ్చి ఉద్యోగులను బెదిరించి, అనంతరం తాళ్లతో కట్టేసి దోపిడి చేశారని పేర్కొన్నారు. ఇందుకు డీసీపీ సత్యనారాయణ నిందితులని తొందరలోనే పట్టుకుంటామని చెప్పారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement