మూడో రోజు రెండు నామినేషన్లు | 3rd Day Naminations In Medak | Sakshi
Sakshi News home page

మూడో రోజు రెండు నామినేషన్లు

Mar 21 2019 2:26 PM | Updated on Mar 21 2019 2:28 PM

3rd Day Naminations In Medak  - Sakshi

అధికారికి నామినేషన్‌  పత్రాలను సమర్పిస్తున్న  పిరమిడ్‌ పార్టీ అభ్యర్థి  సంతోష్‌రెడ్డి 

సాక్షి, మెదక్‌ రూరల్‌: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు బుధవారం మూడో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డికి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి సంతోష్‌రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన బన్సీలాల్‌లు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు కౌటర్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ 18, 19 తేదీల్లో నామినేషన్లు రాలేదన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా 21, 23, 24 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. అందువల్ల 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement