ఫీవర్‌ ఆస్పత్రిలో 32 కుక్కకాటు కేసులు | 32 dog bite cases in Fever hospital | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ ఆస్పత్రిలో 32 కుక్కకాటు కేసులు

Apr 15 2016 8:30 PM | Updated on Sep 29 2018 3:55 PM

స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో శుక్రవారం 32 కుక్క కాటు, ఓ పంది కరిచిన కేసు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉన్నారు.

నల్లకుంట (హైదరాబాద్) : స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో శుక్రవారం 32 కుక్క కాటు, ఓ పంది కరిచిన కేసు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉన్నారు. వీరందరికి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. అలాగే ఓపీ విభాగంలో 381 మంది రోగులు వైద్య పరీక్షలు పొందగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇన్ పేషంట్లుగా చికిత్సలు పొందుతున్న వారిలో మూడు డిఫ్తీరియా కేసులున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement