ముగ్గురు విద్యార్థులు అదృశ్యం | 3 Students missing | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Sep 5 2015 7:30 PM | Updated on Sep 3 2017 8:48 AM

ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

జీడిమెట్ల (హైదరాబాద్) : ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్‌లో ఉన్న సాయిలత పాఠశాలలో ఆరో తరగతి చదివే ప్రసాద్, ప్రదీప్, సిద్ధు అనే ముగ్గురు విద్యార్థులు 4వ తేదీ పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement