ఆహారం వికటించి 25 మందికి అస్వస్థత | 25 people Fall Ill with Food poisoning | Sakshi
Sakshi News home page

ఆహారం వికటించి 25 మందికి అస్వస్థత

Sep 21 2015 11:54 AM | Updated on Sep 18 2018 7:36 PM

ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో 150 మంది బాలికలున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో అల్పాహారంగా ఇచ్చిన ఉప్మా తిన్న విద్యార్థులు 25 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. అధికారులు వారందరినీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని, బాలికలకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement