విషాదాన్ని మిగిల్చిన సాగర్ విహార యాత్ర | 20 injured in medak district road accident | Sakshi
Sakshi News home page

విషాదాన్ని మిగిల్చిన సాగర్ విహార యాత్ర

Jan 3 2015 11:31 AM | Updated on Aug 30 2018 3:58 PM

విహార యాత్ర వారికి విషాదాన్ని మిగిల్చింది. నాగార్జున సాగర్ విహారయాత్రకు వెళుతున్న ఓ ప్రయివేట్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది.

మెదక్ : విహార యాత్ర వారికి విషాదాన్ని మిగిల్చింది. నాగార్జున సాగర్ విహారయాత్రకు వెళుతున్న  ఓ ప్రయివేట్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓవర్ లోడ్తో వెళుతున్న లారీ ...బస్సును వేగంగా వచ్చి ఢీకొన్న సంఘటనలో 20మంది గాయపడ్డారు.

 

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓ స్వచ్ఛంద సంస్థ వృద్ధులను.. నాగార్జున సాగర్ విహార యాత్రకు తీసుకు వెళుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన హెల్పేజ్ ఇండియా బస్సుగా గుర్తించారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement