
ఇద్దరు యువతుల అదృశ్యం
నగరంలో గురువారం ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు.
హైదరాబాద్ క్రైం: నగరంలో గురువారం ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. వివరాలు..బోరబండకు చెందిన జరీనాబేగం(18), బోరబండ పెద్దమ్మ నగర్‌కు చెందిన సోనీ(17)లు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.